![]() |
![]() |

సినిమాల మీద మక్కువతో ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తున్నారు. అయితే కొంతమంది అవకాశాల కోసం చిన్నచిన్న షాట్ ఫిల్మ్ లు, వెబ్ సిరీస్ లు తీసి ఫేమస్ అవుతుంటే మరికొందరు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న వారిలో ఎంతోమంది ఎన్నో అవకాశాలని అందిపుచ్చుకున్నారు. అలాంటివారిలో దీప్తి సునైనా ఒకరు.
తన అందంతో, అటిట్యూడ్ తో పెద్ద సినిమాలలో చేయకపోయినా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్, ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో ట్రెండింగ్ లో ఉంటుంది దీప్తి. అయితే తనకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. అందులో గ్రీన్ కలర్ శారీతో దిగిన కొన్ని ఫోటోలని షేర్ చేసింది. ఆ ఫోటోలలో గ్లామర్ ని చూపిస్తూ కాస్త బోల్డ్ గా కన్పించింది దీప్తి సునైనా. అయితే ఈ ఫోటోలని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. "My response to every situation is "it's all good" because even if it isn't, it will be." అనే క్యాప్షన్ తో ఈ ఫోటోలని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేసింది దీప్తి సునైనా. అవి ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి.
దీప్తి సునైనా.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ లోకి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. దీప్తి సునైన షణ్ముఖ్ జస్వంత్ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి సన్నిహితంగా మారి లవ్ లో పడిపోయారు. ఎటు చూసిన సోషల్ మీడియాలో షణ్ముఖ్, దీప్తి సునైనల జంటనే కనిపించేది. షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనకి దీప్తి సపోర్ట్ బాగా ఉండేది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక షన్ను, దీప్తి సునైనా ఇద్దరు విడిపోయారు. వాళ్ళు విడిపోవడానికి కారణం బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్ ఉన్నప్పుడు.. సిరితో క్లోజ్ గా ఉండడం వల్లనే.. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యిందని అప్పట్లో ఆ న్యూస్ వైరల్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు విడిపోయి.. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. మరి వీరిద్దరికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. దీప్తి సునైన చేసిన ఈ పోస్టులు సినిమా ఆఫర్ల కోసమేనా లేక సరదాగా పోస్ట్ చేసిందా తెలిస్తే కామెంట్ చేయండి.
![]() |
![]() |